నంద్యాల అర్బన్: ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం : నంద్యాలజిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 22, 2026
ఆంధ్రప్రదేశ్ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ రాజకుమారి గణియా కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ సునీల్ షౌరాణో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. యువత డ్రగ్స్ కు బానిస కాకుండా కాపాడటం అవసరమని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో వీటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు.