ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.
డోన్ పట్టణ పాతపేటలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం మంటలు చెలరేగాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో సంఘటన ఘటనా చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్పత్రి ఖాళీగా ఉండటం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.