ఒంగోలు అర్బన్: డ్రగ్స్ లేని సమాజ నిర్మాణానికి మనమందరం కృషి చేయాలి : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
Ongole Urban, Prakasam | Jun 26, 2026
డ్రగ్స్ లేని సమాజ నిర్మాణానికి మనమందరం కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రపంచ మత్తు పదార్దాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఒంగోలు నగరంలో వాక్ ధాన్ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, నోడల్ అధికారి కుమార రాజాలు జెండా ఊపి వాక్ ధాన్ ను ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి రిమ్స్ వరకు వాక్ ధాన్ నిర్వహించి అక్కడ మత్తువదార్దాలకు వ్యతిరేకంగా ప్రతిజ్క్ష చేశారు.