కరీంనగర్: సీతారాంపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు, ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి
కరీంనగర్ లోని సీతారాంపూర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు శుక్రవారం కొత్తపెళ్లి సిఐ కోటేశ్వర్ తెలిపారు. చొప్పదండి కి చెందిన సందీప్ అనే వ్యక్తి ఓ పెయింటింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ కు ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా సీతారాంపూర్ వద్ద కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టగా, అక్కడికక్కడే మృతి మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.