సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడం, ఎండ తీవ్రతకు ఉక్కపోత దెబ్బకు చేరదీయరెందుకు పెద్ద ఎత్తున ప్రజలు తీరానికి తరలి వచ్చారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ అలలతో ఆడుకుంటున్నారు. అలల తాకిడికి లోపలికి వెళ్లకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మెరైన్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ గస్తీ నిర్వహిస్తున్నారు.