రాజేంద్రనగర్: మిర్జాగూడ ఘటనపై విచారణ జరుగుతుంది : చేవెళ్లలో మంత్రి శ్రీధర్ బాబు
మీర్జాగూడ ఘటనలో టిప్పర్లోని కంకర బస్సులో పడడంతో చాలా మంది మృతిచెందారని రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. చేవెళ్లలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారన్నారు. ప్రమాదానికి గల కారణాలపై మెజిస్ట్రీయల్ ఎంక్వయిరీకి నివేదించామని, రవాణా శాఖ మంత్రి డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ కూడా వేస్తున్నట్లు తెలిపారు.