కరీంనగర్: బతుకమ్మ పండుగను తెలంగాణ నుంచి దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది: పద్మా దేవేందర్ రెడ్డి
కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలోని మహాత్మ జ్యోతిబాపూలే మైదానంలో బతుకమ్మ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగాడి సునీత, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి బతుకమ్మను దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.నాడు కెసిఆర్ ప్రభుత్వంలో బతుకమ్మను ప్రతి ఊరులో ఘనంగా నిర్వహించుకున్నామని, ప్రతి ఆడబిడ్డకు చీరే ఇచ్చి పండగ నిర్వహించుకున్నామని, నేడు యూరియా కోసం మహిళలను లైనులో ఉంటున్నారన్నారు.