1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిన సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగాన్ని అంగీకరించిన రోజుగా జరుపుకుంటున్నామని నారాయణపేట అదనపు ఎస్పి ఎండి రియాజ్ హుల్ హక్ అన్నారు. బుధవారం ఉదయము సుమారు 9:30 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో భారత రాజ్యాంగ పీఠిక ను పోలీసు అధికారులు సిబ్బంది అందరూ చదివారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగం అధికారికంగా ఆమోదించినందున ఈ రాజ్యాంగం 1950 జనవరి 26 న అమల్లోకి వచ్చిందని అప్పటినుండి మనం గణతంత్ర దేశంగా మారామని అన్నారు.