మేము అధికారంలోకి వచ్చాక ఏది చేయాలో అదే చేస్తాం : మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో వైసీపీ నాయకులు పై టిడిపి కార్యకర్తలు నాలుగుసార్లు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన జూలకల్లు గ్రామంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో మాట్లాడుతూ అధికారంతో ఇప్పుడు 20 ఎకరాలు పంట లేకుండా నాశనం చేశారని తమ ప్రభుత్వం వచ్చాక 200 ఎకరాలు చేస్తామని హెచ్చరించారు. దాడిలో గాయపడిన అంజిరెడ్డిని పరామర్శించి అయన ఈ వ్యాఖ్యలు చేశారు