నంద్యాల అర్బన్: ఏపీకే యాప్ లను డౌన్లోడ్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ :నంద్యాల శక్తి టీం సభ్యులు
Nandyal Urban, Nandyal | May 27, 2026
వాట్సాప్లో వచ్చే పెళ్లి పత్రికలు, ఏపీకే యాప్లను డౌన్లోడ్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని శక్తి టీం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం నంద్యాల మండలం డబ్ల్యూ కొత్తపల్లి గ్రామంలో మహిళలు, ఉపాధి కూలీలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల అనర్థాలను వివరిస్తూ, డిజిటల్ అరెస్టులు లేవన్నారు. కార్యక్రమంలో రఫీ, మహిళా పోలీస్ లక్ష్మీదేవి పాల్గొన్నారు నేను