అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో శుక్రవారం ప్రమాదవశాత్తూ డ్రైనేజీ కాలువలో పడి మసూదప్ప అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పామిడి పట్టణంలోని సంత మార్కెట్ ప్రాంతం నారాయణస్వామి విధికి చెందిన బోయ లింగన్న కుమారుడు బోయ మసూదప్ప పామిడి శివారులోకి వెళ్తున్నాడు. అయితే ప్రమాదవశాత్తూ కాలువలో పడి మునిగిపోయాడు. కాలువలోతు ఎక్కువగా ఉండటంతో మురుగు నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.