సైదాపూర్: మండల కేంద్రంలో మున్సిపల్ కోర్టును ఏర్పాటు చేయాలని సివిల్ జడ్జిని కలిసిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో మున్సిపల్ కోర్టును ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు సివిల్ జడ్జి పి.బి కిరణ్ కుమార్ కు వినతిపత్రం అందజేసినట్లు శుక్రవారం తెలిపారు. మండల కేంద్రంలో మున్సిపల్ కోర్టును ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందని, హుజురాబాద్ రావడం వల్ల సమయం వృధా అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బార్ అసోసియేషన్ కోశాధికారి భువనగిరి కుమారస్వామి, బార్ అసోసియేషన్ న్యాయవాదు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.