ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టరేట్ వద్ద యాదవ సంఘాలు గొర్రెల కాపర్లు నిరసన, గొర్రెల కాపరుల దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Ongole Urban, Prakasam | Jun 16, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద మంగళవారం గొర్రెల కాపర్లు యాదవ సంఘాలు నిరసనకు దిగాయి. నాగులుప్పలపాడు మండలంలో గొర్రెల కాసేందుకు వెళ్లిన గొర్రెల కాపరులను ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఓ గొర్రెల కాపరికి చేయి కూడా పెరిగింది. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని యాదవ సంఘాలతో పాటు గొర్రెల కాపర్లు కలెక్టరేట్ వద్ద నిరసన కలిపి కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. లేదంటే నిరసనలు ఉధృతం చేస్తామని యాదవ సంఘాలు హెచ్చరించాయి.