అనంతపురం అర్బన్: పుల్లేటిపల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 28, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం సి కె పల్లి మండలం పుల్లేటిపల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో పుల్లేటిపల్లి గ్రామానికి చెందిన పుల్లప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం మైనార్టీ సహాయంతో తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.