కడప: ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు తక్షణమే చెల్లించాలి: సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్
Kadapa, YSR | Sep 17, 2025 రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు తక్షణమే చెల్లించి ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందేలా చూడాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్, డిమాండ్ చేశారు. బుధవారం నాడు కడప నగరంలోని మృత్యుంజకుంటలో ఉన్న సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో 33 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు దాదాపు 70 కోట్ల రూపాయలు నిధులు చెల్లించాల్సి ఉందన్నారు.