రాయచోటి ప్రాంతంలో భారీ వర్షాల హెచ్చరిక: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫైర్ ఆఫీసర్ సూచన
రానున్న మూడు రోజులు రాయచోటి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు మరియు వరదలు సంభవించే అవకాశం ఉందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి తెలిపారు.చెరువులు, వాగులు పొంగిపొర్లే పరిస్థితుల్లో ప్రాణాపాయం ఏర్పడితే వెంటనే ఫైర్ స్టేషన్ అత్యవసర నంబర్ 101 కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.అదేవిధంగా, రెస్క్యూ టీమ్ పూర్తిగా సిద్ధంగా ఉందని, అగ్నిమాపక శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు పాటించి, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.