కొత్తగూడెం: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అంగన్వాడీల ధర్నా
అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని ,ప్రీ ప్రైమరీ స్కూల్ లను అంగన్వాడీలోనే కొనసాగించాలని ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై అంగన్వాడి టీచర్ల అంతా సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవి కుమార్, సహాయ కార్యదర్శి కే సత్య ,జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీల దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలన్నారు.