నంద్యాల అర్బన్: ఓర్వకల్లు సమీపంలో బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన లారీ,ముగ్గురికి గాయాలు
Nandyal Urban, Nandyal | Jul 4, 2026
నంద్యాల జిల్లా ఓర్వకల్లు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. శనివారం నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్తున్న టమాటా లారీ కర్నూలు నుంచి నంద్యాల వైపు వస్తున్న కోళ్ల బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. వెనకే వస్తున్న మరో వాహవానం వీటిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురుకి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.