సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ
దసరా పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె. నరసింహ ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు, వాహనాల పాత్రను ఆయన కొనియాడారు. జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.