బనగానపల్లె: కోవెలకుంట్లలో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్
మహిళ మెడలో నుంచి గొలుసును దొంగలించిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ తెలిపారు. కేసు వివరాలను ఆయన గురువారం వెల్లడించారు. గతేడాది ఆగస్టు 24న ఉదయం వాకింగ్కు వెళ్లి తిరిగి వస్తున్న రంగు లక్ష్మీకుమారి మెడలో నుంచి గొలుసును లాకెళ్లిన షేక్ తలిఫ్ హుస్సేన్, దిల్వార్ను అరెస్టు చేశామన్నారు. 2.5 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని, కోర్టులో హాజరు పరిచామని పేర్కొన్నారు.