విశాఖపట్నం: గీతం వైద్య కళాశాలలో ఆరవ అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
విశాఖలోని గీతం వైది కళాశాలలో చదువుతున్న విస్మత్ అనే 20 ఏళ్ళ యువకుడు బుధవారం 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబ జిల్లాకు చెందిన విస్మత్ సింగ్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు కాగా విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. కాలేజీలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.