నంద్యాల అర్బన్: ఐదు మంది వైద్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 15, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఉదయం10. 10 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 నిమిషాలైనా ఇద్దరు వైద్యులు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక ఫార్మసిస్ట్ విధులకు హాజరు కాలేదని కలెక్టర్ గుర్తించారు. విధులకు హాజరు కాని ముగ్గురు సిబ్బంది తరపున ఎం పి హెచ్ ఓ ద్వారా మూమెంట్ రిజిస్టర్ లో సంతకాలు చేయడం కలెక్టర్ గుర్తించారు ఈ ఘటనపై తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ సంబంధిత ఐదుగురు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వైద్య సిబ్బందితో ప్రజల కందుతున్న సేవలపై ఆరా