సంగారెడ్డి: భూభారతి లో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : రెవిన్యూ అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావిణ్య
భూభారతిలో వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. గురువారం ఆర్డిఓ తాసిల్దారులతో భూభారతి అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతిలో వచ్చిన ప్రతి దరఖాస్తులు నిర్ణీత ప్రొఫార్మాలు పూర్తి వివరాలను నమోదు చేసి జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్డీవోలు తాసిల్దారులు పాల్గొన్నారు.