కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీసు బృందాలు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి డ్రైవర్లకు “స్టాప్ – వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహించాయి.డ్రైవర్లు అలసటగా వాహనాలు నడపకుండా, అతివేగం, రాంగ్ రూట్, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.