అన్నమయ్యజిల్లా.తంబళ్లపల్లి మండలం. చింత రేవుల పల్లె గ్రామానికి చెందిన దామోదర కుమారుడు రాజు, 15 సంవత్సరాలు. వేపూరికోట హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు స్కూల్లో విచారించగా పాఠశాలకు రాలేదని పాఠశాల సిబ్బంది తెలిపారు. బంధువుల ఇండ్లలో చుట్టుపక్కల గాలించిన ఫలితం లేకపోవడంతో తండ్రి దామోదర తంబళ్లపల్లె పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.