బనగానపల్లె: బనగానపల్లెలో సహకార సంఘం ఉద్యోగుల నిరసన
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని భానుముక్కల సహకార సంఘం ఆవరణలో సీఈఓ ఎస్.అబ్దుల్ మునాఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జీవో నం.322 ప్రతులను దగ్ధం చేశారు. ఈ జీవో వల్ల సిబ్బందికి ఎలాంటి ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 'కెపాసిటీ టు పే' నిబంధనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ షామీర్, సిబ్బంది పాల్గొన్నారు.