డోన్: బేతంచెర్ల రోడ్డుపై ఇరుక్కుపోయిన ట్రక్,పైప్ లైన్ లీకేజ్
Dhone, Nandyal | Apr 4, 2026 బేతంచెర్లలోని స్టేట్ బ్యాంక్ సమీపాన భారీ సిమెంట్ ట్రక్కు ఇరుక్కుపోవడంతో తాగునీటి పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. డ్రైవర్ టీ తాగేందుకు ట్రక్కును పక్కకు నిలపగా, టైర్లు భూమిలోకి కుంగి లోపల ఉన్న పైపులైన్ దెబ్బతింది. దీనివల్ల నీరు భారీగా బయటకు వస్తోంది. మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.