అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులు జీరో స్థాయికి తీసుకు వస్తున్నామని ఉరవకొండ మలేరియా శుభాకాంక్షలు యూనిట్ అధికారి కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో ని కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమంను కార్మికులతో చేపట్టారు. అందరూ కలిసి పనిచేస్తే ఇది సాధ్యమవుతుందన్నారు సమాజంలో అతి పెద్ద జబ్బు అపరిశుభ్రతే అని అన్నారు దాన్ని దూరం చేయాలంటే ప్రజలలో నిరంతరం చైతన్యం నింపుతున్నామన్నారు మలేరియా డెంగి చికెన్ గునియా లాంటి వ్యాధుల నివారణకు గ్రామపంచాయతీల సహకారంతో మరింత పకడ్బందీ చర్యలను ముందు జాగ్రత్తగా చేపడుతున్నామన్నారు.