నారాయణపేట్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం 8:30 గం సమయంలో జాతీయ పతాకమును పేట ఎస్పి యోగేష్ గౌతమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం 15 ఆగస్టు 1947 న సిద్ధిస్తే తెలంగాణ ప్రాంతమైన హైదరాబాద్ ప్రాంతానికి 17 సెప్టెంబర్ 1948 రోజున స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ఎందరో స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా హైదరాబాద్ ప్రాంతానికి స్వతంత్రం వచ్చిందని అన్నారు. వారిని మనం ఎల్లప్పుడూ స్మరించు కోవాలని తెలిపారు.