గుంటూరు: తురకపాలెం గ్రామ మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకటరావు డిమాండ్
Guntur, Guntur | Sep 22, 2025 గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో ఉద్దేశపూర్వకంగా జరిపిన నీటి సరఫరా వలన 30 మంది మాలలు ప్రాణాలు కోల్పోయారని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకటరావు ఆరోపించారు. ఇదే అంశంపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ముట్టడించారు. కూటమి ప్రభుత్వానికి, అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మల్లెల వెంకటరావు మాట్లాడుతూ తురకపాలెం గ్రామంలో సంభవించిన మరణాలకు కారకులను అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందచేయకపోవటం బాధాకరమన్నారు.