Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ' జలధార - జలహారతి ' పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు

Ongole Urban, Prakasam | May 13, 2026
' జలధార - జలహారతి ' పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జలధార - జల హారతి, జల సురక్ష మిషన్, ఘన వ్యర్ధాల నిర్వహణపై ఆయన దిశా నిర్దేశం చేశారు. ' జలధార - జల హారతి ' కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే గుర్తించిన పనులలో వేగం పెంచాలని చెప్పారు. చెరువులలో ముళ్ళ చెట్ల తొలగింపు, పూడిక తీత, గట్లు బలోపేతం వంటి పనులలో పురోగతి ఉండాలన్నారు. మరో 75 రోజులు మాత్రమే ఉన్నందున స్థానిక ప్రజలను భాగస్వాములను చేసి ఈ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

MORE NEWS

No related stories for this location.