తణుకు: 53 మందికి రూ. 39 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద కొడుకులా అండగా ఉంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణంతోపాటు రూరల్ మండలం పరిధిలోని 53 మందికి రూ. 39 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి ఎమ్మెల్యే మాట్లాడారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని భావించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.