కోడుమూరు: కోడుమూరులో పంచాయతన ఆలయ నిర్మాణాన్ని పరిశీలించిన ప్రముఖ టెక్స్ టైల్స్ కంపెనీ ప్రతినిధులు
కోడుమూరు పట్టణంలో సుమారు రూ .14 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్న పంచాయతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం కేపిఆర్ మిల్స్, FASO టెక్స్టైల్స్ కంపెనీ ఇండియా బిజినెస్ హెడ్ శరవణన్, సౌత్ ఇండియా జోనల్ ఇన్చార్జి రామలింగం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో శిల్పకళా రీతులను పరిశీలించి ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. త్వరలో కంపెనీ చైర్మన్ ను కోడుమూరుకు తీసుకువస్తామని తెలిపారు. ఆలయ చైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.