రామడుగు: లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుండి వరద కాలువకి నీటిని విడుదల చేసిన అధికారులు
కరీంనగర్ జిల్లా,రామడుగు మండలం,లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ నుంచి ఒక బాహుబలి మోటర్ పంపు ద్వారా,వరద కాలువకు గురువారం సాయంత్రం 6:20 PM కి 2వ దఫా నీటిని విడుదల చేశారు, చొప్పదండి నియోజకవర్గం లోని వివిధ గ్రామాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో,చొప్పుదండి MLA మేడి పెళ్లి సత్యం CM రేవంత్ రెడ్డి,మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి గాయత్రి పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేయాలని కోరడంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిని విడుదల చేశారు నీటిపారుదల శాఖ అధికారులు,ఒక పంపు ద్వారా 3150 క్యూసెక్కుల నీరు వరద కాలువలకు చేరుకుంటున్నాయి,దీంతో రైతులు MLA కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు,