సంతనూతలపాడు: చీమకుర్తి మండలం నిప్పట్లపాడు గ్రామంలో పర్యటించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్
కోటాం ప్రభుత్వం వచ్చిన సంవత్సరకాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. చీమకుర్తి మండలం నిప్పాట్లపాడు గ్రామ క్రిస్టియన్ పాలెంలో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ పర్యటించారు. ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్ని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పధకాల కర పత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.