పుంగనూరు: చౌడేపల్లిలో జూనియర్ కళాశాలలో మోకాళ్ళ లోతు చేరిన వర్షపునీరు. పరీక్షలు రాయడానికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు.
చిత్తూరు జిల్లా. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో గత రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన వర్షపు నీరు. కళాశాల సమీపంలో కొంతమంది రియాల్టర్లు రాజు కాలవను ఆక్రమించడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మోకాళ్ళ లోతుల్లో చేరిన వర్షపు నీరు. జూనియర్ కళాశాల విద్యార్థులకు క్వార్టర్లీ పరీక్షలు జరుగుతుండడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. ఫస్ట్ ఫ్లోర్లో పరీక్షలు నిర్వహిస్తున్న కళాశాల అధ్యాపకులు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.