పలమనేరు: ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోన్లో మాట్లాడుతూ ఉద్యోగం చేస్తున్న సిబ్బంది, విమర్శిస్తున్న ప్రజలు
పలమనేరు: స్థానికులు తెలిపిన సమాచారం మేరకు, వంద పడకల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని నిర్లక్ష్యపు జబ్బు పీడిస్తోందని రోగులు ప్రజలు వాపోతున్నారు. అక్కడ సిబ్బంది రద్దీ వేళల్లో సైతం ఫోన్లో మాట్లాడుకుంటూ రోగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సోమవారం ఓపీ విభాగంలో పనిచేసే సిబ్బంది ఫోన్లో మాట్లాడుకుంటూ రోగులకు వైద్యం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఘటనపై సూపరిండెంట్ మమతా రాణిని వివరణ కోరగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిని హెచ్చరించడం జరిగిందన్నారు.