నంద్యాల అర్బన్: నంద్యాలలో భారీ అగ్నిప్రమాదం, రూ 20 లక్షల ఆస్తి నష్టం
Nandyal Urban, Nandyal | May 4, 2026
నంద్యాల పద్మావతి నగర్ లోని గబ్బర్ కాటన్ బెడ్స్ తయారీ కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దూది నిల్వలు, యంత్రాలు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాణసంచా వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు.