బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మాదక ద్రవ్యమైన MDMAని కొనుగోలు చేసి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో చందు (22), నంజప్ప (32)లను అదుపులోకి తీసుకున్నట్లు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి గురువారం తెలిపారు. నిందితుల వద్ద నుంచి గ్రా.11.34 MDMA, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో గోవాకు చెందిన ఇనావో షైజా, బెంగళూరుకు చెందిన యశ్వంత్ పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ మాదక ద్రవ్యాల వ్యవహారం ఈ నెల 5వ తేదీన శ్రీహర్ష అరెస్టుతో వెలుగు చూసిందన్నారు.