కరీంనగర్: ఈనెల 25 26 27వ తేదీలలో డిసిసి కార్యాలయంలో ఆదివాసి శిక్షణ శిబిరాలు, పాల్గొననున్న మీనాక్షి నటరాజన్
కరీంనగర్ డిసిసి కార్యాలయంలో పిసిసి ఎస్. టి సేల్ సమన్వయకర్త కొట్యా నాయక్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 25, 26, 27 తేదీలలో రాష్ట్ర ఆదివాసి సేల్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో నగరంలోని డిసిసి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆదివాసి శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హాజరై శ్రమదానం కార్యక్రమాలలో పాల్గొంటారని, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.