కర్నూలు: బాలికలే అధిక శాతం మెడల్స్ సాధించడం గర్వకారణం: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
రాయలసీమ యూనివర్సిటీ 4వ కాన్వొకేషన్లో బాలికలు అధిక శాతం బంగారు పథకాలు తీసుకోవడం తనకు సంతోషం ఇచ్చిందని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు రాయలసీమ యూనిర్సిటీ కాన్వొకేషన్లో భాగంగా ఆయన మాట్లాడారు. వచ్చే కాన్వొకేషన్ నాటికి బాలురు అధిక సంఖ్యలో గోల్డ్ మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు. తాను స్వయంగా వచ్చి మరోసారి గోల్డ్ మెడల్స్ బహూకరిస్తారని అన్నారు.