ఒంగోలు అర్బన్: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి
Ongole Urban, Prakasam | Apr 23, 2026
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని..ఆపరేషన్ అనంతరం ఆయన కోలుకుని త్వరగా ప్రజల్లోకి రావాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నానని మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాదు నుండి ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఆరోగ్యం బాగుండాలని పూజలు చేశారన్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.