నంద్యాల అర్బన్: మహానంది ఆలయంలో నిజాయితీ చాటుకున్న హోంగార్డు
Nandyal Urban, Nandyal | May 28, 2026
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన భక్తుడు చంద్రప్ప కుటుంబ సమేతంగా మహానంది ఆలయానికి వచ్చారు. బయటి కోనేరు వద్ద ఆయన తన మొబైల్ ఫోన్ మర్చిపోగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివరాం రాయల్ దానిని గమనించారు. వెంటనే విచారణ చేపట్టి భక్తుడిని గుర్తించి ఫోన్ అందజేశారు. హోంగార్డు నిజాయితీని అభినందిస్తూ బాధితుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.