నిజామాబాద్ సౌత్: జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కీర్తిని, అమరులను స్మరించారు.