డోన్: వచ్చే ప్రభుత్వంలో కార్యకర్తలకు సముచిత స్థానం: డోన్ లో మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | May 24, 2026 నంద్యాల జిల్లా డోన్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా రావడం వల్ల కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు. వచ్చే వైసీపీ ప్రభుత్వంలో క్యాడర్ను అన్ని విధాలుగా గౌరవిస్తామని, వారి ఆర్థిక ఎదుగుదలకు సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరారు