డోన్: రౌడీ షీటర్లకు బేతంచెర్ల సీఐ హెచ్చరిక
Dhone, Nandyal | Jul 5, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడితే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీ షీటర్లకు ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రామాల్లో ఘర్షణలకు, అల్లర్లకు పాల్పడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తే గ్రామ బహిష్కరణ చేస్తానని హెచ్చరించారు.