సిరిసిల్ల: మధ్యాహ్న భోజన వంట కార్మికుల పెండింగ్ బిల్లులు జీతాలు సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేత
మధ్యాహ్న భోజన వంట కార్మికుల పెండింగ్ బిల్లులు పెండింగ్ జీతాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పదివేల జీతం అమలు చేయాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన వంట కార్మికుల పెండింగ్ బిల్లులు జీతాలు చెల్లించాలని వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.