సంగారెడ్డి: దీపావళి ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలి: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్
దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ఆఫర్లు, ప్రకటనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. కేవలం అధికారిక వెబ్సైట్లలో మాత్రమే కొనుగోళ్లు జరపాలని సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే లింకులను తెరవవద్దని ఎస్పీ కోరారు. ఫేక్ ప్రకటనలు నమ్మి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.