చిన్మయ నగర్ JNTU లో చదివే ప్రతి విద్యార్థి ఒక ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి ఫ్రెషర్స్ డే లో JNTU ఉపకులపతి సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ వద్ద జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ ఆడిటోరియంలో శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపగలపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ జేఎన్టీయూలో సీటు తెచ్చుకున్న ప్రతి విద్యార్థి ఇంజనీర్ గా కాకుండా ఒక ఇండస్ట్రియల్ స్థాపకులుగా బయటికి వెళ్లి స్థిరపడాలన్నారు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వచ్చిన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఉపకులపతి సుదర్శన్ రావు పిలుపునిచ్చారు.