కోడుమూరు: కోడుమూరులో స్వస్త్ నారీ - స్వశక్తి పరివార్ అభియాన్ ప్రారంభం
కోడుమూరు పట్టణంలోని రెండవ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో బుధవారం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం వైద్య అధికారి శ్రీమంత్ మాదన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ భాగ్యరత్నమ్మ, జడ్పిటిసి రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. జడ్పిటిసి మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, ఆహారంలో మార్పులు కారణంగా వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యుల సూచనలు పాటించాలన్నారు. వైద్యాధికారి శ్రీమంత్ మాదన్న మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ఆరోగ్య సేవలు, వైద్య పరీక్షలు ఉచితంగా పొందవచ్చన్నారు.